మటన్ కొనే ముందు జాగ్రత్త

by సూర్య | Wed, Oct 27, 2021, 11:36 AM

మటన్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఇటీవల మేకలకు, గొర్రెలకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కొంత మంది వీటి పట్ల ఆలోచన లేకుండా ఇష్టారీతిన మాంసాన్ని అమ్ముతున్నారు. ఇపుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే... కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల వలన ఆంత్రాక్స్‌ వ్యాధి విజృంభిస్తోంది.కావున మీరు మటన్ కొనటానికి ముందు కొన్ని చెక్ చేయటం తప్పని సరి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కట్ చేసిన మేకలను, గొర్రెలను పశువైద్యుడు పరిశీలించాడో లేదో తెలుసుకోవాలి.. నిజానికి అన్ని ప్రదేశాలలో పశువైద్యుడు వచ్చి చెక్ చేయటం సాధ్యపడదు.. అలాంటప్పుడు కట్ చేసిన గొర్రె లేదా మేక ప్రదేశాన్ని చెక్ చేయాలి.. ఎందుకంటే రక్తాన్ని బట్టి దానికి ఆంత్రాక్స్‌ సోకిందో తెలుసుకోవచ్చు.కట్ చేసేప్పుడు మేక లేదా గొర్రె రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే మాత్రం వాటికి ఆంత్రాక్స్‌ సోకిందని అర్థం. ఒకవేళ రక్తం గడ్డలు కట్టినట్టు వస్తే మాత్రం అది ఆరోగ్యకరంగా ఉందని అర్థం. కావున మటన్ కొనే ముందు ఇవి చెక్ చేయండి, ఇలాంటి మాంసాన్ని అసలు అమ్మకూడదని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Latest News

 
మే డే స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందాం Wed, May 01, 2024, 03:05 PM
ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సోదరుడు ప్రచారం Wed, May 01, 2024, 03:02 PM
ఏపీలో గంజాయికే మద్దతు ధర: ప‌వ‌న్ Wed, May 01, 2024, 03:00 PM
హుస్సేన్‌ పురంలో జనసేన ప్రసారం Wed, May 01, 2024, 11:18 AM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: భూపేశ్ Wed, May 01, 2024, 11:17 AM