పెగాసస్‌పై సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు

by సూర్య | Wed, Oct 27, 2021, 11:57 AM

పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది.సుప్రీంకోర్టు రిటైర్‌ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్‌ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ.. ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుంది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది.

Latest News

 
ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో విడుదల చేసిన టీడీపీ Tue, May 21, 2024, 10:34 PM
మదనపల్లెలో పురుగుమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య Tue, May 21, 2024, 09:35 PM
మదనపల్లెలో మహిళ అరెస్ట్ Tue, May 21, 2024, 09:33 PM
కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా Tue, May 21, 2024, 09:30 PM
చీరాలపై ఎస్పీ జిందాల్ డేగ కన్ను Tue, May 21, 2024, 09:28 PM