కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ

by సూర్య | Wed, Oct 27, 2021, 09:20 AM

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో క్యాబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాబినెట్‌లో భారత సంతతికి చెందిన మహిళకు కీలక పదవి దక్కింది. ఎంతో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌ను నియమించారు. ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగుతూ వచ్చారు. అయితే, ఆయనపై సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో విమర్శలు వెల్లవువెత్తాయి. దీంతో ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అనితా ఆనంద్‌కు అప్పగిస్తూ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. అయితే.. సజ్జన్‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Latest News

 
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM
షర్మిల, సునీత పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కడప కోర్టుకు కీలక ఆదేశాలు Fri, May 03, 2024, 07:37 PM
ముద్రగడకు ఇంటిపోరు.. పవన్‌కు మద్దతుగా కూతురు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Fri, May 03, 2024, 07:34 PM