యుపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం.. '4-5వేలమందిలో 23 మంది సాక్ష్యులే కనిపించారా.

by సూర్య | Tue, Oct 26, 2021, 03:18 PM

ఉత్తరప్రదేశ్‌లో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న లఖీంపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉంటే మీకు కేవలం 23 మంది మాత్రమే సాక్ష్యులుగా కనిపించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది సాక్ష్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక సాక్ష్యులందరిని రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది.


విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అశీష్‌ మిశ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి 68 మంది సాక్ష్యులు ఉన్నారని.. వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్ష్యులు కాగా.. మరో 30 మంది స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని తెలిపారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.


''4-5వేలమందితో ర్యాలీ తీస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కానీ మీకు మాత్రం 23 మంది సాక్ష్యులే కనిపించారా.. మీ ఏజెన్సీలకు చెప్పి.. మరింత మంతి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేయమనండి. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా.. న్యాయాధికారులు అందుబాటులో లేకపోయినా.. సమీప జిల్లా కోర్టులో స్టేట్‌మెంట్‌ రికార్డు చేయండి'' అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేశారు.

Latest News

 
జగన్ పెద్ద మోసకారి: ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి Wed, May 01, 2024, 10:15 AM
ఎన్నికల ప్రచారంలో బండారు శ్రావణి శ్రీ Wed, May 01, 2024, 10:10 AM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM