గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం : డీజీపీ గౌతమ్ సవాంగ్

by సూర్య | Tue, Oct 26, 2021, 03:26 PM

ఆంధ్రప్రదేశ్  సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని డీజీపీ చెప్పుకొచ్చారు.ఎన్.ఐ.ఎ. సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికార్లతో డీజీపీ సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సాగుపై లోతుగా మాట్లాడారు.  గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2లక్షాల 90వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న డీజీపీ, గత పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM