సుడాన్‌లో అల్లకల్లోలం

by సూర్య | Tue, Oct 26, 2021, 10:32 AM

ఆఫ్రికా లోని సూడాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అక్కడి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సైన్యం ప్రధానమంత్రితో పాటు పలువురు కీలక నేతలను నిర్బంధించింది. ఈ పరిణామాలతో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడంతోపాటు ఇంటర్నెట్‌ సేవలను సైన్యం నిలిపివేసింది. స్వాతంత్ర్యం పొందిన 1956 నుంచి సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేయడం ఇది ఎనిమిదవసారి.సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆర్మీ జోక్యంతో 2019లో అల్‌-బషీర్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేందుకు సైన్యం - ప్రజాస్వామ్యవాదుల మధ్య ఒప్పందం కుదిరింది.


 


ఒప్పందంలో భాగంగా ప్రధానిగా అబ్దుల్లా హమ్‌దోక్‌ మూడేళ్లపాటు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడి కోసం సైన్యం, పౌర నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రధాని హమ్‌దోక్‌ నిర్బంధించి ఆపని పూర్తి చేసేందుకు ఆర్మీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే సూడాన్‌కు 700 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా నిలిపివేసింది.

Latest News

 
వైసీపీ నుండి టీడీపీలోకి 20 కుటుంబాలు చేరిక Sat, Apr 27, 2024, 06:26 PM
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా కృషి చేస్తా Sat, Apr 27, 2024, 06:22 PM
తాడిమర్రిలో బంగారం, రూ. 50 వేలు నగదు చోరీ Sat, Apr 27, 2024, 06:18 PM
అమ్మఒడి రూ.15 వేలను రూ.17 వేలకు పెంపుచేస్తాం Sat, Apr 27, 2024, 05:09 PM
నాపై అసత్యప్రచారాలు చేస్తున్నారు Sat, Apr 27, 2024, 05:08 PM