కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by సూర్య | Tue, Oct 26, 2021, 08:28 AM

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్‌ లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ ను నిలిపివేయాలని ఆదేశించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా కౌన్సెలింగ్‌ ను ప్రారంభిస్తే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.  ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్‌ పీజీ ఆల్‌ ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్‌ లకు 10శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ ఏడాది జులై 29న మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నోటిషికేషన్‌ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది నీట్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్లు ఇలా కేటాయించడం వల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు ఆరోపించారు. ఇది ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సెలింగ్‌ చేపట్టబోమని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది.

Latest News

 
ట్రావెల్స్ బస్సు లగేజీ డిక్కీలో దాచేసి..ప్లాన్ మొత్తం రివర్స్ Thu, May 02, 2024, 07:56 PM
ఆ 14 స్థానాలపై ఈసీ ప్రత్యేక దృష్టి.. సీన్‌లోకి సీఆర్‌పీఎఫ్ బలగాలు Thu, May 02, 2024, 07:53 PM
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు! Thu, May 02, 2024, 07:48 PM
ఏపీలోని పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. Thu, May 02, 2024, 07:45 PM
హైవేపై వరుసగా 4 కంటైనర్లు.. ఆపి చెక్ చేస్తే.. ఏకంగా రూ.2 వేలకోట్లు Thu, May 02, 2024, 07:42 PM