ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్

by సూర్య | Tue, Oct 26, 2021, 08:26 AM

ఏపీ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను నిన్న  రేషన్ షాపు డీలర్లు వెల్లడించారు. నేటి నుంచి తలపెట్టిన రేషన్ షాపుల బంద్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని విజయవాడలో సంఘం నేతలు ప్రకటించారు. ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు ఈ మేరకు వెల్లడించారు. అయితే, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం స్పందించాలన్న ఆయన, కమీషన్ బకాయిలు చెల్లించడంతో పాటు, గోనె సంచులకు ఎప్పటిలాగా డబ్బులు ఇవ్వాలని జగన్ సర్కారుని డిమాండ్ చేశారు. ఏపీలో రేషన్ దుకాణాలకు సంబంధించి అధికారులు మారినప్పుడుల్లా విధానాలను, నిబంధనలు మార్చడం సరికాదని వెంకట్రావ్ అభిప్రాయపడ్డారు. నేటి నుంచి ఎం.యల్.ఎస్ పాయింట్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించే వరకు వచ్చే నెల స్టాకు ను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే.. బంద్ ను ప్రకటిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Latest News

 
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM