దేశాన్ని దాటిన నైరుతి రుతుపవనాలు

by సూర్య | Mon, Oct 25, 2021, 06:51 PM

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు సంపూర్ణంగా తిరోగమించాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. 1975 తర్వాత ఏడోసారి ఆలస్యంగా తిరోగమించాయని పేర్కొంది. 2010-21 మధ్య ఐదుసార్లు.. 2017, 2010, 2016, 2020, 2021 సంవత్సరాల్లో అక్టోబర్‌ 25, ఆ తర్వాత తిరోగమించాయని పేర్కొంది. రుతుపవనాలు ఈ నెల 6న పశ్చిమ రాజస్థాన్, గుజరాత్‌లో వైదొలగడం ప్రారంభమైంది. 1975 అత్యంత ఆలస్యంగా తిరోగమించడం ఇది రెండోసారి.


వాయువ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. రుతుపవనాల ఉపసంహరణ గత సంవత్సరం సెప్టెంబర్ 28న, 2019 అక్టోబర్ 9న, 2018 సెప్టెంబర్ 29న, 2017లో సెప్టెంబర్ 27న, 2016లో సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతూ ఉంటుందని, వరుసగా మూడోసారి దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వైపు దిగువ ఉష్ణ మండల స్థాయిల్లో ఈశాన్య గాలులు ఏర్పడడంతో.. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభయ్యాయని వాతావరణ పేర్కొంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ఐఎండీ పేర్కొంది.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM