టీ20 ప్రపంచకప్‌- 2021: సెమీస్‌కు చేరే జట్లు ఇవే.: ఇయాన్ ఛాపెల్

by సూర్య | Mon, Oct 25, 2021, 06:08 PM

టీ20 ప్రపంచకప్‌- 2021లో భాగంగా ప్రస్తుతం సూపర్‌ 12 పోటీలు జరగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ సెమీఫైనల్‌కు చేరే జట్లను ముందుగానే అంచనావేశాడు. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-1 నుంచి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, గ్రూప్‌-2 నుంచి భారత్‌, పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయని ఛాపెల్ అభిప్రయపడ్డాడు. అయితే గ్రూప్ 2 లో మిగితా జట్లకు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌ జట్టు గట్టి పోటిస్తుంది అని అతడు తెలిపాడు.


"గ్రూప్ 2నుంచి సెమిఫైనల్‌కు చేరే అవకాశాలు భారత్‌, పాకిస్తాన్‌లకు ఎక్కువగా ఉన్నాయి. అయితే వారికి న్యూజిలాండ్ నుంచి గట్టి పోటి ఉంటుంది. కాగా గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా,వెస్టిండీస్ నాలుగు జట్లు పటిష్టంగా ఉన్నాయి. అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లకు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ ఒక లాటరీ లాంటిది అని ఛాపెల్ ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.


యూఏఈ పరిస్ధితులు పాక్‌కు బాగా కలిసొచ్చాయి...


టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ స్పందించాడు. యూఏఈలో ఆడిన ఆనుభవం పాక్‌ను గెలిపించింది అని అతడు తెలిపాడు.


"గత దశాబ్దం నుంచి యూఏఈలో పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆడుతుంది. అక్కడి పరిస్థితులు ఆ జట్టుకు బాగా తెలుసు. యూఏఈలో ఆడిన ఆనుభవం పాక్‌కు ఈ టోర్నమెంట్‌లో బాగా కలిసిస్తోంది అని భావిస్తున్నాను. మరోవైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అక్కడ ఆడినందున భారత్‌కు కూడా ప్రయోజనం చేకూరుతుంది" అని ఛాపెల్ తెలిపాడు.

Latest News

 
పవన్‌పై ముద్రగడ ఫైర్ Mon, May 06, 2024, 12:26 PM
ఏలూరులో టెన్షన్.. టెన్షన్.. Mon, May 06, 2024, 12:16 PM
కైకలూరు పట్టణంలో వైఎస్ఆర్ సీపీకి కోలుకోలేని దెబ్బ Mon, May 06, 2024, 11:38 AM
కాంగ్రెస్ ను గెలిపించండి: వైయస్ సునీత Mon, May 06, 2024, 11:36 AM
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం Mon, May 06, 2024, 10:43 AM