కేంద్రానికి చిదంబరం చురకలు

by సూర్య | Mon, Oct 25, 2021, 05:09 PM

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిందంబరం సోమవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదల విషయంలో కేంద్రం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలంటూ చురకలంటించారు. ఇతర శతాబ్ది ఉత్సవాల మాదిరిగానే.. ప్రధాని నేతృత్వంలోని మంత్రులు ఇటీవల 100 కోట్ల డోసుల టీకా పంపిణీపై సంబురాలు చేసుకున్నారని చిదంబరం గుర్తు చేశారు.ఇప్పటికే దేశంలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ రూ.100 దాటాయని పేర్కొన్నారు. గ్యాస్‌ ధరలు రూ.1000 దాటితే మరోసారి సంబురాలు చేసుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేస్తూ చిదంబరం ట్వీట్‌ చేశారు. ఆదివారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.59, డీజిల్‌ రూ.96.32 పలుకుతోంది.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM