అధిక బరువు , అధిక కొవ్వు శరీరంలో పేరుకుపోతుందా ...!

by సూర్య | Mon, Oct 25, 2021, 05:13 PM

అధిక బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగుతూ ఉంటారు. అయితే ఇకపై ఆపిల్, అల్లం కలగలిపిన టీని తాగడం అలవాటు చేసుకుంటే ఇక ప్రతిరోజు ఆ టీని తాగేందుకు ఇష్టపడతారు. ఇలా రోజువారిగా యాపిల్ ,అల్లం తో తయారైన టీని తాగటం ద్వారా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ ఫ్రెండ్లీ డైట్ గా పిలవబడే ఈ హెర్బల్ టీ ,ఆపిల్ ,అల్లం టీ, గ్రీన్ టీ వంటివి ఒకవైపు బరువు తగ్గించడంతో పాటు, నీరసం రాకుండా కాపాడుతూ ఉంటాయి.యాపిల్ టీని ప్రతిరోజు తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా, సరైన రుచిని కూడా మనం ఆస్వాదించవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండి, అధిక మొత్తంలో ఫైబర్ ను కలిగి ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.ఇందుకుగాను ముందుగా యాపిల్ , అల్లం తొక్కలను తీసి బాగా చితక్కొట్టి నీటిలో ఉడికించాలి. నీటిలో ఉడికిన తర్వాత కాసేపు చల్లార్చాలి. ఆతరువాత స్మూత్ జ్యూస్‌లా అయ్యేవరకూ గ్రైండ్ చెయ్యాలి. ఇక యాపిల్ టీ రెడీ అయిపోయినట్టే… ఈ టీని ఉదయం పరగడుపున తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM
30న రామనారాయణం దశమ వార్షికోత్సవ వేడుకలు Thu, Mar 28, 2024, 04:00 PM