నీట్ పీజీ కౌన్సెలింగ్ ను నిలిపివేయండి

by సూర్య | Mon, Oct 25, 2021, 12:43 PM

నీట్ పీజీ - 2021 కౌన్సెలింగ్ ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆల్ ఇండియా కోటాలో కేంద్రం ప్రవేశ పెట్టిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చెల్లుబాటుపై తాము నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్ నిర్వహించవద్దని స్పష్టం చేసింది. తాము నిర్ణయం తీసుకోవడానికి ముందే కౌన్సెలింగ్ ను నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. జస్టీస్ చంద్రచుద్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ని సవాల్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై విచరాణ చేపట్టింది. నీట్ అడ్మిషన్లలో ఓబీసీలకు 27 శాతం, EWS కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లను అమలును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM