ఆఫ్ఘన్‌లో ఆకలి చావులు.. తిండి దొరకక 8 మంది చిన్నారులు మృతి

by సూర్య | Sun, Oct 24, 2021, 09:43 PM

తాలిబన్‌ల ఆక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. మైనారిటీలపై హింసలు, హత్యల సంగతి పక్కనబెడితే తాజాగా ఆకలి చావులు కూడా వెలుగుచూస్తున్నాయి. పశ్చిమ కాబూల్‌లో హజారా అనే మైనారిటీ సమాజం నివసించే ప్రాంతంలో ప్రజలకు తిండి కరువైపోయింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక అల్లాడుతున్న అక్కడికి జనాల పరిస్థితిని తాలిబన్‌ల హింసలు మరింత దయనీయంగా మారుస్తున్నాయి.


తాజాగా వెస్టర్న్ కాబూల్‌లో హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలికితో ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రజాప్రతినిధి మహమ్మద్ మహకిక్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాలిబన్‌ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలైన హజారా, షియా కమ్యూనిటీలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలువాలని మహమ్మద్ మహకిక్ కోరారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM