దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు

by సూర్య | Sun, Oct 24, 2021, 11:08 AM

దీపావళి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వైజాగ్-సికింద్రాబాద్, విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనుంది. నవంబర్ 1న సాయంత్రం 7:15 గంటలకు వైజాగ్ నుంచి స్పెషల్ రైలు(08583) ప్రారంభం కానుంది. అది మంగళవారం ఉదయం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుంచి నవంబరు 2న రాత్రి 9: 55 గంటలకు బయలుదేరే రైలు(08584) బుధవారం ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.


అలాగే నవంబరు 2న సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు(08585) ప్రారంభమై బుధవారం ఉదయం 07:10 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే నవంబరు 3న రాత్రి 09:05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు (08586) గురువారం ఉదయం 9:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వే శాఖ ప్రారంభించింది.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM