పసిఫిక్‌లో తొలిసారి రష్యా, చైనా నేవీ విన్యాసాలు

by సూర్య | Sat, Oct 23, 2021, 07:49 PM

రష్యా, చైనా తొలిసారి పసిఫిక్‌ మహా సముద్రంలో నేవీ విన్యాసాలు చేపట్టాయి. అక్టోబర్‌ 17 నుంచి 23 వరకు ఇవి జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. పెట్రోలింగ్‌లో భాగంగా ఇరు దేశాల ఓడల సమూహం మొదటిసారి అంతర్జాతీయ జలాలుగా పరిగణించే సుగారు జలసంధి గుండా వెళ్లినట్లు పేర్కొంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం, రెండు దేశాల సముద్ర ఆర్థిక కార్యకలాపాలను సంరక్షించడంలో భాగంగా ఈ నేవీ డ్రిల్‌ చేపట్టినట్లు తెలిపింది.


కాగా, పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో సన్నిహిత సైనిక, దౌత్య సంబంధాలను రష్యా, చైనా పెంపొందించుకుంటున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్‌ నెల మొదట్లో ఇరు దేశాలు కలిసి జపాన్ సముద్రంలో నావికాదళ సహకార విన్యాసాలు నిర్వహించాయి. మరోవైపు రష్యా, చైనా నేవీ విన్యాసాలను జపాన్ నిశితంగా గమనించింది. ఇరు దేశాలకు చెందిన పది యుద్ధ నౌకలు తమ ద్వీపానికి సమీపంలోని సుగారు జలసంధి మీదుగా వెళ్లాయని తెలిపింది.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM