భారత ఐటీ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్‌ చెప్పిన యాపిల్

by సూర్య | Sat, Oct 23, 2021, 01:38 PM

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత ఐటీ స్టూడెంట్స్‌(Indian IT students)కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో త్వరలో సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Software developers) ఇంటర్న్‌లను రిక్రూట్ చేసుకోనున్నట్టు ప్రకటించింది. యాపిల్ సంస్థకు బెంగళూరు (Bengaluru)లో కార్యాలయం ఉంది. అక్కడ ఇంటర్న్‌గా పనిచేసేందుకు నియామకాలు చేపట్టనుంది. ఫుల్‌టైమ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్‌లను రిక్రూట్ చేసుకొని వచ్చే సంవత్సరం జనవరి నుంచి జులై వరకు ఇంటర్న్‌షిప్‌ (Internship)లో పాల్గొనాల్సి ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది.


యాపిల్ కంపెనీలో ఉన్న అంతర్గత సంస్థల్లో పని చేసేందుకే ఈ ఇంటర్న్‌లను నియమించుకుంటున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. బెంగళూరులో ఉన్న యాప్ యాక్సిలరేటర్ (App Accelerator) కంపెనీ స్థానిక డెవలపర్స్‌కు శిక్షణ ఇస్తుంది. యాప్ డెవలప్‌మెంట్‌కు కావాల్సిన సపోర్ట్ కూడా ఇస్తుంటుంది. అలాగే ఇతర యాప్స్ సక్సెస్ కావడంలో యాప్ యాక్సిలరేటర్ పాత్ర చాలా ప్రముఖమైంది. ఇప్పటి వరకు ఇండియాలో యాప్ యాక్సిలరేటర్ సంస్థ 8,73,000 ఉద్యోగాలను సృష్టించగలిగింది.


 


* యాపిల్‌కు భారత్ స్పెషల్ మార్కెట్


యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లు తయారు చేసే అతికొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. ఇండియాలో ఐఫోన్ 12(iPhone 12), ఐఫోన్ ఎస్ఈ (iPhone SE), ఐఫోన్ 11 (iPhone 11), ఐఫోన్ ఎక్స్ఆర్‌(iPhone XR)తో పాటు ఐఫోన్ 7 (iPhone 7), ఐఫోన్ 6ఎస్‌ (iPhone 6S)ను కూడా తయారు చేశారు. ఇండియాలోని యాపిల్ సప్లయర్స్‌.. యాపిల్ సప్లయర్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్‌లో చేరారు. యూటో, సీసీఎల్ అనే ప్రోగ్రామ్‌లో కూడా చేరారు. అలాగే యాపిల్ మహిళల ఆరోగ్యం, వాళ్ల రక్షణ కోసం విస్ట్రన్ అనే సంస్థతో కలిసి ఎడ్యుకేషనల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను యాపిల్ ప్రారంభించింది. అందుకే.. సరికొత్త హెల్త్ ఫీచర్లతో ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్ తీసుకొస్తోంది.


* ఆ ఫీచర్లపై ఫోకస్


ఐఫోన్లలో హెల్త్ ఫీచర్లను ఇంటిగ్రేట్ చేయడంపై యాపిల్ దృష్టి సారించింది. ప్రస్తుతానికి హెల్త్ ఫీచర్ల గురించి యాపిల్ సంస్థ వివరణ ఇస్తూ.. వచ్చే రెండు మూడేళ్లలో యాపిల్ హెల్త్ ఫీచర్లను ఐఫోన్లలో ఇంటిగ్రేట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Latest News

 
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM
షర్మిల, సునీత పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కడప కోర్టుకు కీలక ఆదేశాలు Fri, May 03, 2024, 07:37 PM
ముద్రగడకు ఇంటిపోరు.. పవన్‌కు మద్దతుగా కూతురు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Fri, May 03, 2024, 07:34 PM