రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు

by సూర్య | Sat, Oct 23, 2021, 01:27 PM

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారయ్యింది. రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురికి అనుమతి లభించింది. ఐతే.. ఢిల్లీకి 18 మంది టీడీపీ నేతలు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.ఇక ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామన్నారు. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. ఎన్టీఆర్‌ భవన్‌పై దాడికి సంబంధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి సీబీఐ విచారణ కోరతామన్నారు. జగన్ రెండేళ్ల పాలన తరువాత అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని.. కమిషన్‌ వేసి అన్ని సంఘటనలను బయటకు తీస్తామన్నారు పయ్యావుల కేశవ్. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు.

Latest News

 
వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చెరికలు Sat, Apr 20, 2024, 12:30 PM
ఇంటి దొంగే అసలు దొంగ.. ఎస్పీ వెల్లడి Sat, Apr 20, 2024, 12:30 PM
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ Sat, Apr 20, 2024, 12:28 PM
జగనన్న తోనే సంక్షేమాలు - చంద్రశేఖర్ Sat, Apr 20, 2024, 12:25 PM
వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు Sat, Apr 20, 2024, 12:24 PM