రూ.50కి మించిన మొబైల్‌ రీఛార్జీలపై ఫోన్‌పే ప్రాసెసింగ్‌ రుసుము

by సూర్య | Sat, Oct 23, 2021, 09:24 AM

వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది. యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు.


* థర్డ్‌ పార్టీ యాప్‌లలో అధిక లావాదేవీలను ఫోన్‌పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్‌పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM