మహిళలతో అసభ్య ప్రవర్తన.. యువకుడు అరెస్ట్

by సూర్య | Sat, Oct 23, 2021, 08:46 AM

రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను వేధిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. నీలి చిత్రాలకు బానిసగా మారిన ఆ యువకుడు మహిళల ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ పైశాచిక ఆనందం పొందుతుండేవాడు.  దినేష్ కుమార్(20) హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఇప్పుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. అతడికి మహిళల ప్రైవేట్ పార్ట్స్‌ను చూస్తూ పైశాచిక ఆనందం పొందడం అలవాటు. అతడు హోటల్‌లో పని ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్లేవాడు కాదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే ఫాలో చేసి ఆమె శరీరంలోని పై భాగాలను నొక్కి వెంటనే బైక్ పై పారిపోయేవాడు. ఇలా చాలా మందిని వేధించాడు. దినేష్ ఇటీవల ఓ యువతిని అడ్డగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి దినేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధిత యువతి అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో దినేష్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్‌ ను గుర్తించి, బైక్‌ పై వెళుతూ వేధింపులకు పాల్పడుతోంది దినేషే అని తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. దినేష్ కుమార్ నీలి చిత్రాలకు బానిసగా మారాడని, అతని ఫోన్‌లో అన్ని నీలి చిత్రాల వీడియోలే ఉన్నాయని తెలిపారు. దినేష్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM