సీఎం జగన్ కీలక ఆదేశాలు

by సూర్య | Sat, Oct 23, 2021, 08:44 AM

గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని, విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ఆయన రివ్యూ చేశారు. ఈ సందర్భంగా హానికరమైన వ్యర్థాల తొలగింపులో సాంకేతిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రేడ్ 2, 3 నగర పంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటిని నగరాలకు, పట్టణాలకు, పంచాయతీలకు చేరవేయాలని ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించి, ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అంతేకాదు అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM