మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించలేవు.. జీ7పై చైనా అక్కసు

by సూర్య | Sun, Jun 13, 2021, 03:17 PM

మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్‌లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైనవైనా, బలహీనమైనవైనా.. పేదవైనా, ధనిక దేశాలైనా అన్నీ సమానమే అని మేము ఎప్పుడూ విశ్వసిస్తాం. అన్ని దేశాల సంప్రదింపులతోనే ప్రపంచ వ్యవహారాలను నిర్వహించాలి అని లండన్‌లోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి అన్నారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ప్రపంచంలో అగ్రదేశం అమెరికాకు సవాలు విసిరే స్థాయికి ఎదిగింది చైనా. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రదేశాలన్నింటి లక్ష్యం ఒక్కటే. అది చైనాకు చెక్ పెట్టడం.


ఇప్పుడు బ్రిటన్‌లో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు కూడా చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా ఇలా ఘాటుగా స్పందించింది. చైనాకు తాము ప్రత్యామ్నాయ శక్తిగా నిలవగలమని జీ7లో భాగమైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, జపాన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే ధనికవంతమైన ప్రజాస్వామ్య దేశాలు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఏకీకృత విధానంతో ముందుకు రావాలని చైనాపై చర్చ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇతర దేశాలకు సూచించారు. చైనా చేపట్టిన వేల కోట్ల విలువైన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందిన దేశాలు మరో బలమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావాలని జీ7 భావిస్తోంది.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM