బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఆ నటికీ మద్దతుగా.. ఇరకాటంలో చీఫ్‌

by సూర్య | Sat, Jun 12, 2021, 04:03 PM

లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్‌ మేకర్‌. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్‌ బీజేపీ యూనిట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు.


అయిషాకు మద్దతుగా లక్షద్వీప్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్‌ ఖాదర్‌ హాజీకి పంపించారు. ''లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్‌ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్‌, జిల్లా కలెక్టర్‌ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్‌ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద'ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM