విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ని తాకిన బంతి.. అక్కడి అక్కడే కూర్చుండిపోయినా రసెల్‌

by సూర్య | Sat, Jun 12, 2021, 03:45 PM

 విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ .. తన పవర్‌ హిట్టింగ్‌తో ఎంతోమంది బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బలంగా బాదే రసెల్‌కు షార్ట్‌బాల్‌ ఆడడంలో కాస్త వీక్‌నెస్‌ ఉంది. తాజాగా అదే షార్ట్‌బాల్‌ అతని హెల్మెట్‌కు బలంగా తాకడం.. స్ట్రెచర్‌పై మైదానం వీడేలా చేసింది. వివరాలు.. శుక్రవారం క్వెటా గ్లాడియేటర్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.


అ‍ప్పటికే రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన రసెల్‌కు ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో మహ్మద్‌ ‍ముసా షార్ట్‌బాల్‌ వేశాడు. బంతి బౌన్స్‌ అయి రసెల్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో తన హెల్మెట్‌ తీసిన రసెల్‌ గాయం తీవ్రతను చూసుకున్నాడు. ఫిజియో వచ్చి పరీక్షించి ఏం కాలేదు అన్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే తరహాలో వేసిన షార్ట్‌బాల్‌ను ఆడే షాట్‌ ఆడే ప్రయత్నంలో మహ్మద్‌ వసీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో తల పట్టేయడంతో రసెల్‌ అలానే కింద కూర్చుండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్‌ తీసుకొచ్చి రసెల్‌ను దానిపై పడుకోబెట్టి తీసుకెళ్లారు. కాగా రసెల్‌ గాయం తీవ్రత గురించి ఎక్స్‌రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్‌ఎల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM