భార్యతో కలిసి వ్యాయామం చేస్తున్న ఇండియన్ క్రికెటర్.. వీడియో వైరల్..

by సూర్య | Fri, Jun 11, 2021, 12:46 PM

భార్య ధనశ్రీ వర్మతో యుజ్వేంద్ర చాహల్ చేసిన ఎక్సర్‌సైజ్ వీడియో నెట్టింట్ తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం వ్యాయామం చేయాలనిపించాలనే భావనకు వస్తారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన చాహల్.. ధనశ్రీ చుట్టూ ఆలోచనలు తిరగడానికి ప్రతీ రోజు శిక్షణ తప్పనిసరి అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ రచ్చ చేస్తోంది.


ఇదిలాఉంటే.. ఈ వీడియో ప్లే చేయగానే తొలుత ధనశ్రీ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంటుంది. ఆ తరువాత చాహల్ ఎంట్రీ అవుతాడు. ఇద్దరూ కలిసి భారీ ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు సాయంగా వ్యాయామం చేస్తున్న ఈ వీడియో క్లిప్‌ను చాహల్ గురువారం నాడు తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 4.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. అదేస్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక చాలా మంది అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేశారు. చాలా మంది ఈ జంట వ్యాయామ కసరత్తులను ప్రశంసించారు. ఈ వీడియో చూడటం ద్వారా ఇతరులు ప్రేరణ పొందుతారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM