200 మంది ఉద్యోగులను తొలగించిన బుక్ మై షో.. కారణంతో సీఈవో భావోద్వేగ ట్వీట్

by సూర్య | Fri, Jun 11, 2021, 12:35 PM

కరోనా మహమ్మారి వలన ఎంతో మంది జీవితాలు రోడ్డు పైకి చేరాయి. కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బకోట్టింది. దీంతో ఎన్నో కంపెనీలు మూతపడగా.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ పై ఎక్కువగానే పడింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడగా.. షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతేడాది ప్రారంభమైన ఈ వైరస్ ప్రభావం ఆయా రంగాలను ఆర్థికంగా కోలుకోనివ్వడం లేదు. తాజాగా ఈ వైరస్ ప్రభావం.. ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో సంస్థ పై పడింది.


కరోనా కారణంగా ఆ సంస్థ దాదాపు 200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత మే నెలలో ప్రపంచవ్యాప్తంగా 270 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. అంటే ఆ కంపెనీలో 18.6% శాతం ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయాన్ని బుక్ మై షో సీఈవో ఆశీష్ హేమరాజని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఎంతో మంది ప్రతిభావంతుల్ని తొలగించాల్సి వస్తుంది. కరోనా ఎన్నో పాఠాలను నేర్పింది. తొలగించిన ఉద్యోగులు మాకు సహాయం చేయాలని కోరారు. కొత్త ఉద్యోగాలు పొందడానికి బాధిత సిబ్బందికి సహకరిస్తాం. అందుబాటులో ఉన్న ఏవైనా ఉద్యోగ అవకాశాలపై సమాచారం తీసుకొని సాయం చేస్తాం#8230; అంటూ ట్వీట్ చేశారు. కొత్త ఉద్యోగం కొత్త చోటు ప్రయాణం ప్రారంభించాలనుకునేవారికి ఉద్యోగ సమాచారం తెలియజేయండి అని తెలిపారు. తిరిగి కోవిడ్ క్రైసిస్ నుంచి కోలుకుని అంతా బలంగా తిరిగి వస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2007లో ఇండియాలో ప్రారంభించిన ఈ ఆన్ లైన్ టికెటింగ్ సంస్థ అతి తక్కువ కాలంలో టాప్ స్థాయికి ఎదిగింది. కరోనా కారణంగా.. థియేటర్లు మూతపడడం, షూటింగ్స్ నిలిచిపోవడం వలన బుక్ మై షో సంస్థ పై ఎక్కువగానే ప్రభావం చూపించింది.

Latest News

 
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM
రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం Mon, May 13, 2024, 09:15 PM
గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ Mon, May 13, 2024, 08:59 PM
బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్ Mon, May 13, 2024, 07:45 PM
కదం తొక్కిన ఏపీ ఓటర్లు.. రికార్డు స్థాయిలో పోలింగ్ Mon, May 13, 2024, 07:41 PM