దేశంలో కరోనా మరో వేరియంట్‌ గుర్తింపు.. అత్యంత ప్రమాదకరమైనదిగ పరిశోధకుల సూచనా.!

by సూర్య | Mon, Jun 07, 2021, 10:44 AM

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో ప్రమాదకరమైన వైరస్‌ను గుర్తించారు. పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ "ఎన్‌ఐవీ" నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో కరోనా వైరస్‌ 'బీ.1.1.28.2 కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్‌, యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను సేకరించి.. జన్యుక్రమాల "జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ " ను విశ్లేషించగా 'బీ.1.1.28.2' వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది.


వేరియంట్‌ను తొమ్మిది సిరియన్‌ రకానికి చెందిన ఎలుకల్లో ప్రవేశ పెట్టగా.. ఇన్ఫెక్షన్‌ సోకిన వారం రోజుల్లోనే లక్షణాలు బయటపడడం ప్రారంభమైందని పరిశోధకులు తెలిపారు. శరీరంలో ఇన్ఫెక్షన్‌ భారీగా వ్యాపించడంతో మూడు ఎలుకలు చనిపోయాయని పేర్కొన్నారు. వేరియంట్‌ కొత్త వేరియంట్ శరీర బరువు తగ్గించిందని, శ్వాసకోశ, ఊపిరితిత్తుల్లో సమస్యలకు కారణమైందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ డెల్టా వేరియంట్‌తో సమానమని, ఆల్ఫా వేరియంట్‌ కంటే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, వైరస్‌పై వ్యాక్సిన్ల సమర్థతను తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM