ఎపి ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్ల సమ్మె నోటీసు

by సూర్య | Mon, Jun 07, 2021, 10:37 AM

ఎపి జూనియర్‌ డాక్టర్లు  తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎపి ప్రభుత్వానికి సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ నెల 9 వ తేదీ నుండి అత్యవసర సేవలు మినహా అన్ని విధులను బహిష్కరించనున్నట్లు జూనియర్‌ డాక్టర్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌లకు స్టైఫండ్‌ పెంచాలని, కోవిడ్‌ విధులను నిర్వహిస్తున్న మెడికల్‌ విద్యార్థులకు ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని జూనియర్‌ డాక్టర్లు కోరారు. ఎస్‌ఆర్‌కు అందించే స్టైఫండ్‌ నుంచి టిడిఎస్‌ కటింగ్‌ లేకుండా చూడాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ విధులను నిర్వహించే జూనియర్‌ డాక్టర్లకు, ఎస్‌ఆర్‌లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌కు అవకాశం కల్పించాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM