14 రోజుల్లో కొవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

by సూర్య | Fri, Jun 04, 2021, 10:41 AM

కొవిడ్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అనంతపురంలో 300 పడకలతో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో నెలకొల్పిన కోవిడ్ ఆసుపత్రిని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్టంలోనే తొలిసారి భారీ ఎత్తున 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యంగర్ల ఆసుపత్రిని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. కరోనా నేపథ్యంలో సీఎం ఆసుత్రిని వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి రెండు నెలల గడువున్నప్పటికీ కేవలం 14 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇక ఈ ఆసుపత్రిలో ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని తాడిపత్రి శివారులోని అర్జా స్టీల్ ప్లాంట్ సమీపంలో నిర్మించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో కొవిడ్ పేషెంట్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM