మధ్యప్రదేశ్ లో 3వేల మంది డాక్టర్ల రాజీనామా?

by సూర్య | Fri, Jun 04, 2021, 11:10 AM

కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న సమయంలో 3వేల మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులు 24 గంటల్లో తిరిగి విధుల్లో చేరాలని మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం ఆదేశించింది. దీంతో దాదాపు 3 వేల మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తీర్పును సవాలు చేస్తామని ప్రకటించారు. నాలుగు రోజుల వైద్యుల సమ్మెను చట్టవిరుద్ధం అని కోర్టు పేర్కొంది.రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది జూనియర్ వైద్యులు గురువారం తమ పోస్టులకు రాజీనామా చేశారు.


తమ రాజీనామాలను ఆయా కాలేజీల డీన్‌లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎంపీజేడీఏ) అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ మీనా తెలిపారు.సోమవారం ప్రారంభమైన సమ్మె వారి డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రాణాంతక మైన కరోనా వైరస్ సంక్రమిస్తే తమకు, తమ కుటుంబాలకు స్టయిఫండ్ పెంచాలని, ఉచిత చికిత్స అందించాలని జూనియర్ వైద్యులు డిమాండు చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగటాన్ని ధర్మాసనం ఖండించింది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM