మోడీ సర్కార్‌కు చెమట పట్టించిన సుప్రీం కోర్టు.. వ్యాక్సినేషన్ పై ప్రశ్నల సంధిపు

by సూర్య | Mon, May 31, 2021, 03:55 PM

వ్యాక్సినేషన్‌ పాలసీపై మోడీ సర్కార్‌ సుప్రీంకోర్టులో పలు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని అత్యున్నత న్యాయ స్థానం ఎత్తి చూపింది. వివిధ రకాలు వ్యాక్సిన్‌ ధరల నిర్ణయం, డోసుల కొరత, నెమ్మదిగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యులు కాకపోవడం వంటి వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ ఏడాది చివరి నాటి కల్లా మొత్తం జనాభాకు వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో సహా మరో కేంద్ర మంత్రి ధ్రువీకరించారని ప్రభుత్వ నిపుణులు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ, వివిధ వయస్సుల వారికి వ్యాక్సిన్‌ అందించడంలో వ్యత్యాసం, వివిధ ధరలు, కోవిన్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ ఫాంను అందుబాటులో ఉంచడం... అదేవిధంగా రోడ్డు దిగ్బంధనాల సమస్యలను లేవనెత్తింది.




'45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు అందించడంలో కేంద్రం చూపించిన ఆసక్తి... 18-44 ఏళ్ల మధ్య వారికి టీకాలు అందించడంలో కనబర్చలేదు. ఆ బాధ్యతలు రాష్ట్రాలకు వదిలేసింది. తయారీదారుల నుండి 50 శాతం రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేస్తున్నాయి. అదీ కూడా ధరలను కేంద్రం నిర్ణయిస్తుంది. మిగిలినవి ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించడం... అసలు దీని ప్రాతిపదిక ఏంటీ' అని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, ఎల్‌ఎన్‌ రావు, నాగేంద్ర భట్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఓ రకంగా చెప్పాలంటే మీరు ఆసక్తి కనబర్చిన 45 ఏళ్లకు పైబడిన వారు ఈ సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ చనిపోలేదని, 18-44 మధ్య వయస్కులే ఎక్కువ మంది ప్రాణాలు విడిచారని పేర్కొంది. టీకాల సేకరణ మీ ఉద్దేశమే అయితే...? 45 ఏళ్ల వాళ్లకు మాత్రమే ఎందుకు చేపట్టారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.


'రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ చెల్లించాలి? దేశ వ్యాప్తంగా ఒకే ధర ఉండేలా కేంద్రం బాధ్యతలు తీసుకోవాలి. ధరలు నిర్ణయించే అధికారం కేంద్రానికి ఉంది' అని ఎత్తిచూపింది. 'వ్యాక్సిన్‌ ధరలు నిర్ణయించే అధికారం తయారీ సంస్థలకు ఎందుకు వదిలేసింది' అని ప్రశ్నలు సంధించింది. 18-44 ఏళ్ల మధ్య వయస్సుల వారికి కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్లు సరిపోని కారణంగా ఇతర దేశాల నుండి వ్యాక్సిన్లు తెచ్చుకునేందుకు ఢిల్లీ, ముంబయి కార్పొరేషన్‌తో పాటు ఇతర రాష్ట్రాలు సిద్ధమవ్వడాన్ని ప్రశ్నించింది. అంతర్జాతీయ వ్యాక్సిన్‌ సంస్థల వద్దకు ఈ సమస్యలను తీసుకెళ్లవద్దని హితవు కోరింది. ముంబయి స్పుత్నిక్‌ కోసం బిడ్‌ దాఖలు చేసిందని, దీన్ని కూడా రాష్ట్రాలకు వదిలి పెట్టారా లేక... కేంద్రం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందా అంటూ మరో ప్రశ్న వేసింది. విదేశాల నుండి వ్యాక్సిన్లను పొందుతున్న రాష్ట్రాలను, నగరాలను ఇబ్బందులకు గురి చేయకండని సూచించింది.


అదేవిధంగా కోవిన్‌ యాప్‌లో నమోదు ప్రక్రియ చేసిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వడంపై మండిపడింది. దీని ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయాలు లేని గ్రామీణాలు దీనికి దూరంగా ఉన్నాయని, దీనివల్ల ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములు కాలేకపోయారని పేర్కొంది. కోవిన్‌ యాప్‌లో నమోదు చేయమనడం... గ్రామీణ ప్రజల విషయంలో సమంజసమా అని ప్రశ్నించింది. అయితే నగరాలకు వచ్చి... కంప్యూటర్‌ సెంటర్ల వద్ద నమోదు చేసుకోవచ్చునన్న సమాధానంపై స్పందిస్తూ... ఇది నిజంగా ఆచరణాత్మకమైనదా?, వలస కార్మికులు కూడా ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్లే అవకాశం లేని ఈ సమయంలో ఇది ఎంత వరకు సాధ్యమని నిలదీసింది. 

Latest News

 
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM
సినీ నటుడు సిద్ధార్థ నిఖిల్ ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 04:30 PM
బ్యాంకుల వద్ద పింఛన్ దారుల పడిగాపులు Thu, May 02, 2024, 04:29 PM
కబడ్డీ పాలెంలో దామచర్ల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 04:19 PM
ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పార్టీ కార్యాలయాలు ఏర్పాటు Thu, May 02, 2024, 04:14 PM