ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే.?

by సూర్య | Mon, May 31, 2021, 04:41 PM

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం నైరుతి రుతు పవనాలు మరింత బలపడుతున్నాయని, జూన్ 3వ తేదీ నాటికి రుతు పవనాలు కేరళలలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్ర వాతావరణ పరిస్థుల గురించి కీలక ప్రకటన చేశారు. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే వివరాలు వెల్లడించారు.


అధికారుల ప్రకటన మేరకు ఈ రోజు ఉత్తర కోస్తా్ంధ్రలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మంగళవారం, బుధవారం  దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.


రాయలసీమలోనూ ఇంచుమించుగా ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక మంగళవారం నాడు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. బుధవారం నాడు మాత్రం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM