పెట్రోల్‌ ధరల పెరుగుదల పై విజయవాడలో సిపిఎం వినూత్న నిరసన

by సూర్య | Mon, May 31, 2021, 03:28 PM

పెట్రోల్‌ ధరల పెంపును ఖండిస్తూ... సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డులో ఉన్న ఎస్‌పిఆర్‌ శ్రామిక భవన్‌లో సోమవారం నిరసన చేపట్టారు. క్రికెట్‌ బ్యాట్లు, తాళ్ళతో సైకిల్స్‌ను, బైక్‌ను లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్రం పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం సిగ్గు చేటని అన్నారు. పెట్రోల్‌ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా మరింత పెరుగుతాయన్నారు. జగన్‌, చంద్రబాబులు మోడి అంటే భయపడుతున్నారని, మే నెలలో ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలు 19 సార్లు పెరిగినా నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌ ధరలు తగ్గించే వరకు తాము పోరాటం చేస్తామని బాబురావు స్పష్టం చేశారు.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM