ఆనందయ్య మందు పంపిణి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

by సూర్య | Mon, May 31, 2021, 02:37 PM

ఆనందయ్య మందు వాడితే హాని లేదని సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక తేల్చింది. అంతే కాదు నివేదికలు ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని కూడా నివేదికల్లో పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు ఏవీ లేవని కూడా నివేదికల్లో పేర్కొంది. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి రావడానికి మరో రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( CCRAS) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. అవి రావడానికి 2- 3 వారాలు సమయం పడుతుందని వివరించింది. కె అనే మందును కమిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్‌ దీనికి నిరాకరించింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి నిరాకరించింది. అయితే ఆనందయ్య ఇచ్చే పి.ఎల్.ఎఫ్‌ మందులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కంట్లో వేసు మందుపై ఇంకా నివేదిక రాకపోవడంతో ఈ మందుపై నిర్ణయంను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM