రెండు రోజుల్లో ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతి : ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి

by సూర్య | Sun, May 30, 2021, 09:52 AM

ఆర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య మందుకు రెండు రోజుల్లో ప్రభుత్వ అనుమతి వచ్చే అవకాశాలున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండ లంలోని ఇస్కపాళెం పీహెచ్‌సీలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శనివారం ఆయన పరిశిలించారు. ఈ సందర్భంగా కరోనా సోకిన వారి వివరాలు, వారికి అందిస్తున్న వైద్యం, పారిశుధ్య నిర్వహణపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందుపై వివాదాలు సృష్టించేందుకు కొంతమంది పనికట్టుకొని రాజకీయ రగడ సృష్టిండానికి ప్రయత్నం చేస్తున్నారని, అయినా సంయమనం పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే బొనిగి ఆనందయ్య ఆధ్వర్యంలోనే కరోనా మందును తయారుచేసి సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పంపిణీ చేస్తామ న్నారు. ఆయన వెంట ఎంపీడీవో ఏ సరళ, తహసీల్దార్‌ ఐఎస్‌ ప్రసాద్‌, ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్‌ పద్మ, సిబ్బంది గణి బాషా, దయానిధి, రజిని, చంద్రకళ, సర్పంచ్‌ అడపాల ఏడు కొండలు, నాయకులు కోదండరామిరెడ్డి, ఎం వెంకటశేషయ్య, సుధా కర్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, కిషోర్‌ రెడ్డి, చాట్ల వెంకటసుబ్బయ్య తదితరులు ఉన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM