కరోనా కష్టకాలంలో హిజ్రాల కొరకు రూ. 1500 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

by సూర్య | Thu, May 27, 2021, 12:08 PM

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కష్టకాలంలో హిజ్రాల కొరకు రూ. 1500 ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందుకోసం https://www.nisd.gov.in అను వెబ్ సైట్ నందు మీ ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తదితర విషయాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కొవిడ్ పరిస్థితుల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం చేయూతనివ్వాలని ఈ మేరకు నిర్ణయించింది. బిక్షాటనే తప్ప మరో వృత్తి లేనివారే ఎక్కువగా ఉంటున్నారని గుర్తించిన కేంద్రం ట్రాన్స్ జెండర్స్ కు తక్షణ జీవనాధార సహాయాన్ని అందిస్తామని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM