'రైతులు ఆందోళనల్ని వాయిదా వేసుకోవాలి'

by సూర్య | Mon, Apr 12, 2021, 08:21 AM

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల్ని వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సూచించారు. రైతులు కరోనా నిబంధనలు పాటించాలని, సాగు చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొంటున్న రైతుల పిల్లలు, వృద్ధుల్ని ఇళ్లకు పంపాలని, ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. దేశంలో అనేక రైతు సంఘాలతో పాటు ఆర్థికవేత్తలు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కొందరు రైతులు మాత్రమే వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 11 విడతలుగా చర్చలు జరిపిందని గుర్తు చేశారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM