మహారాష్ట్రలో కరోనా కల్లోలం

by సూర్య | Mon, Apr 12, 2021, 07:49 AM

మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు, యాక్టివ్ ‌కేసుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 63,294 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 349 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,07,245కు, మర­ణాల సంఖ్య 57,987కు చేరింది. ముంబైలో ఆదివారం రికార్డు స్థాయిలో 9,989 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 34,008 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 27,82,161కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,65,587 యాక్టివ్ ‌కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM