దేశంలో కరోనా తీవ్రత..

by సూర్య | Sat, Apr 10, 2021, 10:53 AM

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజులు గడిచిన కొద్ది రోజువారీ యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,45,384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. మరో వైపు కరోనా బారినపడి 794 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,0926కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 1,68,436 మంది చనిపోయారు. 24గంటల్లో 77,567 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు మొత్తం 1,19,90,859 మంది కోలుకున్నారు. రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో యాక్టివ్‌ కేసులు 10లక్షల మార్క్‌ను దాటాయి. ప్రస్తుతం దేశంలో 10,46,631 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,80,75,160 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. దేశంలో రెండో దశలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. వారాంతపు లాక్‌డౌన్‌తో పాటు నైట్‌కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చినా రోజువారీ కేసులు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 11,73,219 కొవిడ్‌ శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 25.52 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ చెప్పింది.


 


న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజులు గడిచిన కొద్ది రోజువారీ యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,45,384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. మరో వైపు కరోనా బారినపడి 794 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,0926కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 1,68,436 మంది చనిపోయారు. 24గంటల్లో 77,567 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు మొత్తం 1,19,90,859 మంది కోలుకున్నారు. రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో యాక్టివ్‌ కేసులు 10లక్షల మార్క్‌ను దాటాయి.


ప్రస్తుతం దేశంలో 10,46,631 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,80,75,160 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. దేశంలో రెండో దశలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. వారాంతపు లాక్‌డౌన్‌తో పాటు నైట్‌కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చినా రోజువారీ కేసులు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 11,73,219 కొవిడ్‌ శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 25.52 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ చెప్పింది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM