మద్యం ప్రియులకు బంపరాఫర్.. ఎక్కడంటే

by సూర్య | Sat, Apr 10, 2021, 07:52 AM

కరోనా వ్యాక్సిన్ దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే బీర్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ‘కరోనా టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్‌ పట్టుకెళ్లండి’ అంటూ ప్రచారం చేపట్టింది. టీకాలు వేసుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించాలని కోరుతోంది. తాజా ప్రకటనతో గుర్గావ్‌ గోల్డ్‌ రోడ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్‌కు మద్యం ప్రియుల తాకిడి పెరిగిపోయింది. కాగా ఈ ఆఫర్ ఈ నెల 5న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ వారం వరకు కొనసాగుతుందని రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న గుజరాత్ లో స్వర్ణకారుల వర్గానికి చెందిన మహిళలలకు ముక్కుపుడక, పురుషులకు చేతి కడియాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM