9 ఏళ్ల వయసులోనే రూ.221 కోట్ల సంపాదన!

by సూర్య | Fri, Apr 09, 2021, 04:35 PM

ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ హవానే నడుస్తోంది. చాలా మంది యూట్యూబ్ ద్వారా సెలెబ్రిటీలు అయిపోతున్నారు. డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌ లో పుట్టిన 9ఏళ్ల ర్యాన్ కాజీ అనే బాలుడు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. అతడి ఛానల్ ‌లో పిల్లలకు సంబంధించిన ఆటలు, సైన్స్ ప్రయోగాలు, మ్యూజిక్ వీడియోలు, స్కిట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోలు ఉన్నాయి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన యూట్యూబర్ ‌గా ర్యాన్ అవార్డులు అందుకున్నాడు. ర్యాన్ గతేడాది యూట్యూబ్ నుండి సుమారు రూ.221 కోట్లు సంపాదించాడని కథనాలు చెబుతున్నాయి. కాగా, 2021 మార్చి 28వ తేదీ వరకు ర్యాన్ ఛానల్‌ కు ప్రస్తుతం 46.16 బిలియన్ వ్యూస్ ఉండగా.. 29.1 మిలియన్ సబ్‌స్రైబర్స్ ఉన్నారు. అతడి ఛానెల్ పేరు 'ర్యాన్ కాజీ యూట్యూబ్ ఛానెల్'.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM