అమెరికాలో మళ్లీ కాల్పులు..

by సూర్య | Fri, Apr 09, 2021, 02:49 PM

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ రాష్ట్రం బ్రియాన్లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడు జోబైడెన్‌ తుపాకుల హింసను అంటువ్యాధి అని, ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రణాళికను ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని బ్రియాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దుండగుడు కాల్పులు ఎందుకు జరిపాడనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు పోలీస్ చీఫ్ ఎరిక్ బస్కే వెల్లడించారు. కెంట్ మూరే కేబినేట్స్‌లో ఈ ఘటన జరిందని, నిందితుడు ఈ సంస్థలోనే పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM