దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పై క్లారిటీ..

by సూర్య | Fri, Apr 09, 2021, 02:30 PM

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్‌ అవుతోంది. వైరస్‌ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై సీఎంలతో మోదీ చర్చించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


ఇకపోతే లాక్ డౌన్ పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలి అని తెలిపారు. వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు మోదీ. ముఖ్యంగా కరోనా నియంత్రణలో విఫలమవుతున్న రాష్ట్రాలకు మోదీ కీలక సూచనలు చేశారు. ప్రజలు నిర్లక్ష్యంగా మారిపోయారు. ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగింది. కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి’ అని మోదీ తెలిపారు. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రులతో చెప్పారు. అలాగే టీకాలు వృథా కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM