కోవిడ్‌ నివారణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం: సీఎం జగన్

by సూర్య | Fri, Apr 09, 2021, 12:48 PM

కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని, వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిసారించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాలతో పాటు రూరల్‌ల్లో కూడా వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ‘నాడు–నేడు’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. రోజుకు సగటున 1. 4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని తెలిపారు.


కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని, అర్బన్‌ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM