అద్భుతం.. మూడుకాళ్ల శిశువుకు పునర్జన్మ!

by సూర్య | Wed, Apr 07, 2021, 12:33 PM

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిపాలెం గ్రామానికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు మార్చి 4వ తేదీన మూడు కాళ్లతో ఆడ శిశువు జన్మించింది. మూడోకాలు వెన్నుముక భాగం నుంచి బయటకు ఉండటంతో డాక్టర్లు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ పాపను పరీక్షించిన న్యూరో విభాగం వైద్యులు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు.


అక్కడి వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి మూడో కాలును తొలగించారు. నడుం భాగంలో మిగిలిన రెండు కాళ్లకు సంబంధించిన నరాలు కాలుకు అతుక్కుని పోవడంతో వాటిని ఆధునిక చికిత్స ద్వారా వేరు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. నడుము నుంచి వచ్చిన మూడో కాలుకు పురుష జననంగాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు గుంటూరు జీజీహెచ్ లో ఇలాంటివే 21 కేసులు నమోదయ్యాయని, ఇది 22వ కేసు అని డాక్టర్లు తెలిపారు. తన బిడ్డకు గుంటూరు ప్రభుత్వ వైద్యులు ప్రాణం పోయడం ఆనందంగా ఉందని పాప తల్లి వెంకటేశ్వరమ్మ తెలిపారు. తమ పాపకు పునర్జన్మను ప్రసాదించారని ఆమె అన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM