పెళ్లి వేడుకలో ట్విస్ట్.. కూతురే కోడలిగా వచ్చింది!

by సూర్య | Tue, Apr 06, 2021, 04:43 PM

చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురు.. తన కుమారుడితో జీవితం పంచుకోబోయే కోడలే అని ఓ తల్లి పెళ్లి వేడుకలో గుర్తించింది. కొత్త కోడలి చేతిపై పుట్టుమచ్చని చూసి 20 ఏళ్ల కిందట తప్పిపోయిన తన కూతురు ఆ యువతేనని ఆ మహిళ నిర్ధారించుకుంది. చైనాలోన జియాంగ్సు ప్రావియన్స్‌ లో మార్చి 31న ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టుమచ్చను పోల్చుకున్న ఆ మహిళ నేరుగా వధువు తల్లితండ్రులను ప్రశ్నించింది. దీంతో తమకు చాలా ఏళ్ల కిందట ఆమె రోడ్డు పక్కన కనిపించగా తీసుకొచ్చి పెంచుకున్నామని చెప్పారు.


ఈ కథంతా విన్న ఆ నవ వధువు కన్నీరుమున్నీరైంది. తనకు జన్మనిచ్చిన తల్లిని గుర్తించడం పెళ్లి కంటే ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్‌ కూడా వెల్లడైంది. తాను తన సోదరుడిని పెళ్లి చేసుకుంటున్నానని పెళ్లి కూతురు కలత చెందగా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పెళ్లి కొడుకు తన సంతానం కాదని, తాను అతడిని దత్తత తీసుకున్నానని ఆ మహిళ తెలిపింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారు ఒకే కడుపున జన్మించనందున వారి వివాహం సమస్య కాబోదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆ జంటకు పెళ్లి చేయగా ఆ కొత్త జంటను అందరూ ఆశీర్వదించారు.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM