అక్కడ టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత

by సూర్య | Tue, Apr 06, 2021, 02:34 PM

చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధాన్ని పెషావర్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. ఈ యాప్‌లో అనైతిక కంటెంట్ అప్‌లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. అశ్లీల కంటెంట్ అప్‌లోడ్ అవుతోందనే ఆరోపణలపై టిక్‌టాక్‌పై మార్చి 11న పెషావర్ హైకోర్టు నిషేధం విధించింది. గురువారం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ యాప్‌లో అసభ్యకరమైన, అనైతికమైన కంటెంట్ అప్‌లోడ్ అవకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ)ని ఆదేశించింది. తదుపరి విచారణ మే 25న జరుగుతుందని, సవివరమైన సమాధానాన్ని సమర్పించాలని పీటీఏని ఆదేశించింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కైసర్ రషీద్ ఈ తీర్పు చెప్పారు. టిక్‌టాక్‌లో అనైతిక కంటెంట్‌ను తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని అధికారులను జస్టిస్ రషీద్ అడిగారు. దీనిపై పీటీఏ డీజీ తారిక్ గండపుర్ స్పందిస్తూ, అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసేవారిని బ్లాక్ చేయడానికి టిక్‌టాక్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM