‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’ పథకానికి అర్హతలివే

by సూర్య | Tue, Apr 06, 2021, 02:27 PM

సామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పథకానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ నగరపాలిక సంస్థ పరిధిలోని 5కి.మీ దూరంలో అన్ని వసతులతో కూడిన ఇళ్ళ స్థలాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు ఇలా అన్ని మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 18 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అప్ప్లై చేయొచ్చని తెలిపారు.


ఈ పథకంలో భాగంగా 150 చదరపు గజాల స్థలం పొందాలంటే ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు ఆదాయం ఆదాయం ఉండాలి. 200 చదరపు గజాల స్థలం పొందాలంటే ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం ఉండాలి. 240 చదరపు గజాల స్థలం పొందాలంటే ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల ఆదాయం ఉండాలి. సచివాలయ సిబ్బంది ఈ నెల 6,7 తేదీల్లో డిమాండ్‌ సర్వే నిర్వహిస్తారని, అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM