ముంబైలో ఐపీఎల్‌ మ్యాచులు షెడ్యూల్‌ ప్రకారమే

by సూర్య | Mon, Apr 05, 2021, 11:16 AM

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తున్న వేళ, వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్ విధించడంతో, వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరుగుతాయా లేదా అన్నదానిపై అభిమానుల ఉత్కంఠకు బీసీసీఐ తెర దించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) కార్యదర్శి సంజయ్ నాయక్ మాట్లాడుతూ ఐపీఎల్‌ మ్యాచులు షెడ్యూల్  ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని, ఇందులో ఎటువంటి మార్పు లేదని తెలిపారు.


ఆటగాళ్లు మాత్రమే కాదు, సహాయ సిబ్బంది, చివరికి బస్సు డ్రైవర్లు, ఇలా ప్రతిదీ బయో సేఫ్టీ బబుల్ లో ఉన్నందున ఇది సమస్య కాదని బీసీసీఐ భావిస్తోంది. మ్యాచ్ రోజులలో స్టేడియానికి ప్రయాణించడం సమస్య కాదు. ఆటగాళ్లతో పాటు వారి సహాయ సిబ్బందికి కూడా క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం దుబాయిలో తీసుకున్నజాగ్రత్తలు లానే అన్ని ఏర్పాట్లను బోర్డు చేస్తోందని తెలిపారు.  ఇక ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా భావించి ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.


వాంఖడే స్టేడియం ఈ సీజన్‌లో ఏప్రిల్ 10-25 వరకు 10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ ఏప్రిల్ 10 న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే  ఈ జట్లు ముంబైలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని నెట్ప్‌ లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM