సాంప్రదాయ దుస్తుల్లో దుర్గమ్మ దర్శనానికి అనుమతి

by సూర్య | Mon, Apr 05, 2021, 11:20 AM

 ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకునే భక్తులకు…కొవిడ్‌ నిబంధనల కారణంగా అంతరాలయంలో అమ్మవారిని దగ్గర నుంచి వీక్షించే అవకాశం లేక ఏడాది గడిచిపోయింది. నిబంధనల సడలింపులో భాగంగా..సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించాలని దేవస్థానం ఈవో సురేష్‌బాబు నిర్ణయించారు.ఇది 5వ తేదీ సోమవారం నుంచి అమలులోకి రానుంది. గతంలో మాదిరిగానే పురుషులు పైజమా, లాల్చి లేదా పంచె, కండువా, మహిళలు చీర లేదా పంజాబిడ్రెస్‌, చున్నీలతో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచించారు. సంప్రదాయ దుస్తులు లేకుండా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం..దేవస్థానం పవిత్ర సారె కౌంటరులో పంచె, కండువా సెట్‌ను రూ.200లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM